28-08-2024 RJ
తెలంగాణ
నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద రెండు రోజులుగా రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నా ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం.. మాక్లూర్ మండలం చిట్లి గ్రామానికి చెందిన వంశీ (19), నిజామాబాద్ కుమార్ దల్లి ప్రాంతానికి చెందిన రాజేష్ (20) అనే ఇద్దరు యువకులు. తమ స్నేహితుడైన రాజేష్ అనే మరో యువకుడితో కలిసి కారులో వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం విషయం తెలుసుకున్న నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ వెల్లడించారు.
Watch Here: https://bit.ly/3T2FCjd