03-09-2024 RJ
తెలంగాణ
ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాలో ఆదివారం వరద ప్రమాదంలో మృతి చెందిన నూనావత్ మోతిలాల్, ఆయన కుమార్తె యువ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని చిత్రపటాలకు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. దేశం ఒక యువ శాస్త్రవేత్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.