03-09-2024 RJ
తెలంగాణ
హైదరాబాద్, సెప్టెంబర్ 3: టాలివుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే స్వభావం ఉన్న ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలకు జనం విలవిలలాడటం చూసి చలించి వారిని ఆదుకునేందుకు తనవంతు సాయంగా కోటి రూపాయలు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు అందచేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు సృష్టించిన విలయం తనను ఎంతగానో కలచి వేసిందని, బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా ఉభయ రాష్ట్రాలకు కోటి రూపాయలు అందచేస్తున్నట్టు ఆయన తెలిపారు.