29-08-2024 RJ
సినీ స్క్రీన్
నందమూరి బాలకృష్ణ గారు సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో.. తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్ ని కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి, మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ బాలకృష్ణ గారి గురించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది.