03-11-2023 Super
టెక్ ట్రెండ్స్
సడెన్‌గా పాము కనిపిస్తే ఎవరికైనా వెన్నులో వణకు వస్తుంది. విషపూరితమైన ఆ ప్రాణి పేరు ఎత్తడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ 15 ఏళ్ల యువకుడు ఇప్పటిదాక 10 వేలకు పైగా విషసర్పాలను ఇట్టే పట్టుకున్నాడు. పాములను పట్టుకోవడంలో అతడి నైపుణ్యాన్ని చూసి అతడిని జనాలు కింగ్ కోబ్రా అని పిలుస్తున్నారు.
మధ్య ప్రదదేశ్ లోని వీరేంద్ర నగర్‌లో నివాసముంటున్న అంబరీష్ సింగ్ పరిహార్ అనే వ్యక్తి చాలా కాలంగా పాములను పట్టుకుంటున్నాడు. పాములను పట్టుకుని భద్రంగా లోయలు, అడవుల్లోకి తీసుకెళ్లి వదిలేస్తాడు.
ఇతని చిన్న వయసులో ఒక విషపూరిత పాము కనిపించింది. దానిని స్థానిక ప్రజలు కొట్టి చంపారు. దీనికి చలించిపోయిన అంబరీష్ ఇక నుంచి ఏ పామును చావనివ్వనని తన మనస్సులోనే ప్రతిజ్ఞ చేశాడు.
అతని బృందంలో ఐదుగురు సభ్యులు ఉన్నారు. పాము ఉందని ఫోన్ ద్వారా సమాచారం అందిన వెంటనే, అతను తన బృందంతో అక్కడికి చేరుకుంటాడు. అంతే కాదు అతను ఈ పనిని ఉచితంగా సేవా స్ఫూర్తితో చేస్తాడు. భారతదేశంలో అనేక రకాల పాములు కనిపిస్తాయి,
వాటిలో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రా. అంబరీష్ సింగ్ పరిహార్ ఇప్పటి వరకు పది వేల పాములను పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాడు. అందులో కింగ్ కోబ్రా వంటి ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి. ఈ బృందం పాములను పట్టుకోవడానికి ఎలాంటి రుసుము వసూలు చేయదు.