03-11-2023 Super
తెలంగాణ
తెలంగాణ టీడీపీ మాజీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్‌లో చేరడానికి అన్ని ఏర్పాటు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీడీపీని కాదని మరో పార్టీని గెలిపించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మరోవైపు ముదిరాజ్ సామాజికవర్గంలో కాసానికి మంచి గుర్తింపు ఉంది.