03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలు ఎక్కవగా ఉండటం రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దులోని ప్రజలకు వరంగా మారింది. ఓ మహిళ తెలంగాణ నుంచి తెచ్చిన మద్యాన్ని అక్రమంగా అమ్ముతోందని నందిగామ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సదరు మహిళ ఇంటిలో తనిఖీలు చేశారు.
అయితే ఎంతగా వెదికినా పోలీసులకు ఇంట్లో ఎక్కడా మందు దొరకలేదు. కానీ పోలీసులకు అందిన సమాచారం మాత్రం పక్క. దీంతో పోలీసులు ఆ మహిళను తమదైన స్టైల్ లో ప్రశ్నించారు.
దీంతో ఆ మహిళ తాను మద్యం దాచిన ప్లేస్ చూపించింది. ఆమె చూపించిన ప్లేస్.. అక్రమ మద్యాన్ని చూసి పోలీసులే షాక్కు గురయ్యారు. ఎందుకంటే పూర్వం రాజుల కాలంలో నిధినిక్షేపాలను సొంరంగాల్లో దాచినట్లు ఈ మహిళ తెలంగాణ నుంచి తెచ్చిన మందుని దాచడం కోసం ఓ సొరంగం తవ్వింది.
అందులో మద్యం సీసాలను దాచి పెట్టి అక్రమంగా అమ్ముతుంది.. నందిగామ పోలీసులు భారీగా మద్యం, నగదును స్వాధీనం చేసుకున్నారు.. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న నాగమణి అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మనసాగరంలోని ఓ ఇంటివద్ద నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో సొరంగంలా తవ్వి దానిలో తెలంగాణనుంచి తెచ్చిన 90 మద్యం బాటిల్స్ దాచిపెట్టింది నాగమణి. పోలీసులకు ఎటువంటి అనుమానం రాకుండా కొంత కాలంగా ఆమె ఇలాగే మద్యం అమ్ముతోంది.
అక్రమంగా పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.