03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 10న తిరుమల వైకుంఠ ఏకాదశి ప్రత్యేక దర్శనంతో పాటు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు.
10 రోజులకు ఆఫ్ లైన్ లో ప్రత్యేక దర్శనం రూ.2.25 లక్షలు, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు రూ.20 వేలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. టోకెన్లు ఉన్నవారికే వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని చెప్పారు.
తిరుపతిలో నవంబర్ 22 నుండి ఆఫ్ లైన్ లో ఉచిత దర్శనం టికెట్లు జారీ చేస్తామని వెల్లడించారు. భక్తులకు నాణ్యమైన ఆహారం తక్కువ ధరకు అందివ్వడానికి తిరుమలలో మూడు రెస్టారెంట్లను ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కు ఇచ్చామని తెలిపారు