03-11-2023 Super
టెక్ ట్రెండ్స్
హర్యానాలోని సిర్సా జిల్లాలో ఉన్న హైవేపై నిత్యం వందలాది ట్రక్కులు రాకపోకలు సాగిస్తుంటాయి. కానీ ఓ ట్రక్కు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రోడ్డుపై వెళ్తున్న ఆ లారీని చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. కెమెరాల్లో బంధించారు. జనాలు అంతలా ఎగబడనానికి కారణమేంటంటే.. ఆ ట్రక్కుకు 416 టైర్లు ఉన్నాయి.
దాని పొడవు 40 మీటర్లు ఉంటుంది. ఈ బాహుబలి ట్రక్కులో ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన భారీ యంత్రాలను తీసుకెళ్తున్నారు.
ఇది తనంతట తాను కదల్లేదు. ఈ బాహుబలి ట్రక్కును ముందు రెండు ట్రక్కులు లాగుతున్నాయి. వెనక నుంచి ఇంకో ట్రక్కు తోస్తుంది. మూడు లారీలు సాయం చేస్తున్నా.. ఇది నెమ్మదిగా కదులుతుంది. అంత స్లోగా వెళ్తోంది కాబట్టే.. నెలల తరబడి ప్రయాణిస్తుంది.
ఈ ట్రక్కు 10 నెలల క్రితం గుజరాత్‌లోని కాండ్లా పోర్టు నుంచి బయలుదేరింది. పంజాబ్‌లోని ఓ కంపెనీకి ఆయిల్ రిఫైనరీని వెళ్లాల్సి ఉంది. ట్రక్కు వెంట 25-30 మంది సిబ్బంది ఉంటారు.
రోడ్డును క్లియర్ చేస్తూ.. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి.. పరుగులు తీస్తూ కనిపిస్తారు. ఇది ప్రయాణిస్తున్న రోడ్డుపై వేరే వాహనాలను అనుమతించరు. వేరొక మార్గంలో మళ్లిస్తారు. ఇది వెళ్లిపోయిన తర్వాతే.. రోడ్డు క్లియర్ అవుతుంది. పంజాబ్‌లోని రామమండిలో నిర్మించిన రిఫైనరీకి వెళ్లాలని ఆ ట్రక్కుతో పాటే వెళ్తున్న టెక్నికల్ ఇంచార్జి రవీందర్ పాండే చెప్పారు.
ఇంతకి ఈ లారీ స్పీడ్ ఎంతో తెలుసా? వేగంగా అస్సలు వెళ్లదు. నత్తనడిచినట్లుగా నడుస్తుంది. రోజుకు 12 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది.