03-11-2023 Super
టెక్ ట్రెండ్స్
ప్రాంతానికో కట్టుబాటు..ఊరికో అలవాటు ఉంటుంది. కొన్ని చోట్ల విచిత్రమైన సంప్రదాయాలు ఉంటాయి. కాని ఎక్కడైనా ఊళ్లో జనం దుస్తులు లేకుండా మాత్రం ఉండరు.
చిన్నపిల్లలు తప్ప అందరూ దుస్తులు వేసుకొనే ఉంటారు. కాని ఆ ఊరిలో మాత్రం అలా కాదు. ఒంటి నిండా డ్రెస్ వేసుకుంటే ఊరిలోకి అడుగుపెట్టనివ్వరు. అవును ఇది నిజం. ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రాంతంలో ఎవరూ దుస్తులు వేసుకోరు.
దుస్తులు వేసుకుంటే ఆ ప్రాంతంలోకి నో ఎంట్రీ. ఇదెక్కడి విడ్డూరం అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవండి. ఫ్లోరిడా రాష్ట్రంలో ఒక ప్రత్యేక బీచ్ ఉంది. దీనిని నేకెడ్ బీచ్ అంటారు. ఇక్కడ ప్రజలు బట్టలు లేకుండా తిరుగుతారు.
ఈ బీచ్ అసలు పేరు హాలోవర్ బీచ్. యూకేలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని స్పీల్‌ప్లాట్జ్ అనే గ్రామ ప్రజలు విద్యావంతులు. పేదవారేమీ కాదు. అయితే ఇక్కడి ప్రజలు దుస్తులు అస్సలు ధరించరు. 1929 నుంచి ఇక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఊరు లోపల బట్టలు లేకుండా తిరుగుతున్నా.. బయటికి వెళ్లేటప్పుడు బట్టలు వేసుకుంటారు.
ఆస్ట్రియాలో ప్రతి సంవత్సరం నేకెడ్ ఆర్ట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో దేశం నలుమూలల నుండి ప్రజలు పాల్గొంటారు. ఇక్కడ వారు బట్టలు లేకుండా ప్రదర్శనలు ఇస్తారు. ప్రతి సంవత్సరం మార్చి 12న వివిధ నగరాల్లో నేక్డ్ బైక్ రైడ్ రేసులు నిర్వహిస్తారు. ఈ సమయంలో వారు ఎలాంటి దుస్తులు ధరించరు.