04-11-2023 Super
తెలంగాణ
ఇది చలికాలం. అయినా వాతావరణం చల్లబడలేదు. ఎండల తీవ్రత ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. అయితే.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కొంత ఉపశమనం కలుగుతోంది.
అక్కడి నుంచి తెలుగు రాష్ట్రాలవైపు భారీగా మేఘాలు వస్తున్నాయి. భారత వాతావరణ విభాగం తాజా బులిటెన్ ప్రకారం.. తమిళనాడు దగ్గర్లో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. దక్షిణ రాష్ట్రాల్లో 7 రోజులు వర్షాలు పడనున్నాయి. శనివారం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయి.
కానీ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పలేదు. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడతాయని చెబుతున్నాయి. శనివారమంతా ఏపీ, తెలంగాణపై మేఘాలు ఉంటాయి.
కోస్తా, తూర్పు రాయలసీమ, తూర్పు ఉత్తరాంధ్రలో జల్లులు కురుస్తాయి. తూర్పు రాయలసీమకు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష సూచన ఉంది. దక్షిణ రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు పడతాయి. తెలంగాణలో మాత్రం మేఘాల వాతావరణమే కనిపిస్తోంది. గాలి కదలికల్ని చూస్తే.. తూర్పు నుంచి దక్షిణ రాష్ట్రాలవైపు వైపు వీచే గాలులు.. అక్కడి నుంచి ఏపీ, తెలంగాణకు వస్తున్నాయి.
అందువల్ల మేఘాలు కూడా వస్తున్నాయి. దీంతో గాలి వేగం గంటకు 11 నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది. టూవీలర్లపై వెళ్లేవారు జాగ్రత్తపడాలి. ఉష్ణోగ్రతలు గమనిస్తే శనివారం రాత్రివేళ తెలంగాణలో కనిష్టంగా 22 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.
అలాగే ఏపీలో రాత్రివేళ కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్, గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మేఘాల కారణంగా... భూమిలో వేడి.. విశ్వంలోకి వెళ్లట్లేదు. అందుకే చల్లదనం లేదు. పగటి ఉష్ణోగ్రత చూస్తే,
తెలంగాణలో కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. గరిష్టంగా 30 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ ఉండగా.. గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.