04-11-2023 Super
టెక్ ట్రెండ్స్
ఇప్పటి వరకు రేవ్ పార్టీలలో డ్రగ్స్ వాడకం గురించి విన్నాం. కానీ ఇప్పుడీ సంస్కృతి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఓ రేవ్ పార్టీలో పాము విషాన్ని మత్తు కోసం వాడారు.
సమాచారం తెలిసిన పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. అయితే, ఇక్కడ మత్తు కోసం పాము విషాన్ని వాడిన వ్యక్తి మరెవరో కాదు, బిగ్ బాస్ విజేత ఎల్విష్ యాదవ్ అని తేలింది.
నోయిడాలోని సెవ్రాన్ బాంక్వెట్ హాల్‌లో జరిగిన రేవ్ పార్టీలో పాము విషాన్ని ప్రయోగించినందుకు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న అతడి కోసం యూపీ పోలీసులు విస్తృతంగా వెతుకుతున్నారు. ఈ విషయాన్ని నోయిడా డీసీపీ ధ్రువీకరించారు.
ఎల్విష్ యాదవ్ కోసం మూడు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ఎల్విష్ యాదవ్ తనను తాను నిర్దోషిగా ప్రకటించుకుంటూ ఒక వీడియోను విడుదల చేశాడు. తన ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పాడు.