05-11-2023 Super
టెక్ ట్రెండ్స్
అది అమెరికా.. ఫ్లోరిడాలోని... పాస్కో కౌంటీకి చెందిన న్యూ పోర్ట్ రిచీ ఏరియా. అక్కడ కొంత మంది పిల్లలు ఆడుకుంటూ ఉండగా... ఓ పిల్లాడు... బంతి కోసం సమీపంలోని చెట్ల దగ్గరకు వెళ్లాడు. ఆ చెట్లపై భారీ నత్తలు మెల్లగా వెళ్తూ కనిపించాయి.
నత్తలు ప్రపంచమంతా ఉన్నాయి. కానీ అక్కడ కనిపించిన నత్తలు చిన్నగా లేవు. ఎలుక సైజులో ఉన్నాయి. వాటిని చూసిన ఆ పిల్లాడు... భయంతో గట్టిగా అరిచాడు. మిగతా పిల్లలంతా వచ్చేశారు. అందరూ వాటిని ఆశ్చర్యంగా చూశారు.
ఫ్లోరిడా అధికారులు కూడా వాటిని చూసి హెచ్చరికలు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ.. క్వారంటైన్ విధించారు. అవి మామూలు నత్తలు కావు. వ్యాధులను వ్యాపింపజేసే నత్తలు. అవో రకమైన జాతి నత్తలు. ఆఫ్రికా వాటి పుట్టినిల్లు. అవి ఫ్లోరిడాలోని ఆ పట్టణంలో చాలా చోట్ల కనిపిస్తున్నాయి.
వేలల్లో ఉన్నాయి ఇదే అధికారులను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ నత్తలు తిరుగుతున్న విషయాన్ని ఫ్లోరిడా వ్యవసాయ, వినియోగదారుల సేవా విభాగం నిర్ధారించింది. ఈ నత్తలు ఏయే వస్తువులపై తిరిగాయో వాటిని ప్రజలు ముట్టుకోవద్దని అధికారులు తెలిపారు.