05-11-2023 Super
టెక్ ట్రెండ్స్
ఎవరూ చెయ్యలేనిది చేస్తేనే ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. అప్పుడే గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్కులో మన పేరు నమోదవుతుంది. చరిత్రలో పేరు నిలిచిపోతుంది. ఇలాంటి ఛాన్స్‌ని తమ టాలెంట్‌తో దక్కించుకున్నారు ఇద్దరు యువకులు. సాధారణంగా కారు టైరును మార్చడం అనేది తేలికైన విషయం కాదు.
అందుకు ప్రత్యేక పరికరాలు కావాలి. నట్లు, బోల్టులనూ తొలగించాలి. పంక్చర్ అయిన టైరును తీసేసి, మరో టైరు సెట్ చెయ్యాలి. మళ్లీ నట్లూ, బోల్టులూ బిగించాలి. ఇదంతా చెయ్యడానికి చాలా మందికి అరగంటకు పైగా టైమ్ పడుతుంది. అయినా చాలా మందికి టైర్ మార్చడం కూడా రాదు.
కానీ ఇటలీకి చెందిన డ్రైవర్ మాన్యుయల్ జోల్డాన్, టైర్లు మార్చే జియాన్లుకా ఫోల్కో ఇద్దరూ కలిసి ఈ స్వాష్ బక్లింగ్ గిన్నీస్ రికార్డును బ్రేక్ చేశారు. నడుస్తున్న కారు టైరును చాలా ఫాస్ట్‌గా అంటే 1 నిమిషం 17 సెకండ్లలోనే మార్చేసిన రికార్డు ఇప్పుడు వీరి సొంతమైంది.
ఇద్దరిలో మాన్యుయల్ కారును నడుపుతూ... ఓ పక్కకు వంచాడు. దాంతో... కారు రెండు చక్రాలతో వెళ్లసాగింది. ఆ సమయంలో కుడివైపు ముందు ఉన్న చక్రాన్ని గబగబా మార్చేశాడు ఫోల్కో. దాంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ వీరి వశం అయ్యింది.