05-11-2023 Super
తెలంగాణ
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో భారీగా చేరికలు
సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ అన్నారు. బి ఫామ్ తీసుకున్న అనంతరం టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని కలిశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు సలీం ఖాన్ తోపాటుగా పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినట్లు ప్రకటించారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించి రేవంత్ రెడ్డి గారికి బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. అవినీతిపరమైన కెసిఆర్ ప్రభుత్వం ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని తెలిపారు.