06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
పేరుకే ఇది చలికాలం. నవంబర్ మాసం వచ్చినా ఉక్కపోత తగ్గడం లేదు. తగినంత వర్షపాతం లేక అనేక గ్రామాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఎండలతో మండిపోతున్నారు. ఎండలు, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఏపీకి చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని హెచ్చరిక జారీ చేసింది. అల్లూరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం,సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
వర్షాధారంగా సాగుచేసిన పలు పంటలకు ఈ వర్షాలతో ఎంతో మేలు జరుగుతుందని రైతులు చెబుతున్నారు. మరోవైపు ఈ ఏడాది సరిపడా వర్షాలు లేకపోవడంతో పలు జిల్లాలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.