06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియా వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై తీవ్ర విమర్శలు చేశారు.
నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారారని మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలై ఉండీ టీడీపీకి సేవ చేస్తున్నారని దుయ్యబట్టారు. పురంధేశ్వరి, ఆమె భర్త... చంద్రబాబు పల్లకీ మోస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణకు చెందిన ‘అన్న టీడీపీ’కి కొంత కాలం గౌరవ అధ్యక్షురాలిగా ఉండి ఆ పార్టీ ఎన్నికల్లో పరాజయం పాలయ్యాక కాంగ్రెస్‌లో చేరారంటూ వ్యాఖ్యానించారు.