ad1
ad1
Card image cap
Tags   Telangana

  06-11-2023       Super

చంద్రబాబును అడగితే నిజం తెలుస్తుంది: కేసీఆర్ వ్యాఖ్యలపై తుమ్మల స్పందన

తెలంగాణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ నాయకుల విమర్శలు, ప్రతివిమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో చలికాలంలోనూ రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.

వివిధ పార్టీల నేతలు విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కేసీఆర్, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు మధ్య పేలుతున్న మాటల తూటాలు రాజకీయాలను మరింత రంజుగా మారుస్తున్నాయి.

ఆదివారం ఖమ్మంలో నిర్వహించిన సభలో తుమ్మలపై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పువ్వాడ అజయ్ చేతిలో ఓడిపోయి తుమ్మల ఇంట్లో కూర్చున్నారని... ఆయనను తానే పిలిచి మంత్రి పదవిని ఇచ్చానని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై తుమ్మల అదే స్థాయిలో ప్రతిస్పందించారు. కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇవ్వడం కాదని... తానే ఆయనకు మంత్రి పదవిని ఇప్పించానని తుమ్మల అన్నారు.

గతంలో తనతో పాటు కేసీఆర్ కూడా టీడీపీలో ఉన్నారని... ఆ సమయంలో చంద్రబాబుతో మాట్లాడి కేసీఆర్ కు తానే మంత్రి పదవి ఇప్పించానని చెప్పారు. తొలుత కేసీఆర్ కు చంద్రబాబు అటవీశాఖ ఇచ్చారని...

ఆ శాఖ కేసీఆర్ కు ఇష్టం లేకపోతే... తాను బాబుతో మాట్లాడి రవాణాశాఖను ఇప్పించానని తెలిపారు. ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగూ ఒప్పుకోరు కాబట్టి... చంద్రబాబును అడిగితే నిజం తెలుస్తుందని అన్నారు.

08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

03, Sep 2024

బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్

Top Stories
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP

Trending News
08, Sep 2024

జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ MAC హౌసింగ్ సొసైటీకి భూమి కేటాయింపు

07, Sep 2024

గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీకి ఇళ్ల స్థలాలివ్వాలి

05, Sep 2024

మమ్మల్ని ఆదరించే ప్రజలకు మేం ఎప్పుడు అండగా ఉంటాం: రాఘవేంద్రరావు

03, Sep 2024

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందిన తాజా చిత్రం ‘జనక అయితే గనక’

Trending Videos
22, Jun 2024

జిల్లేడు చెక్కతో చేసిన ప్రతిమను పూజిస్తే చాలు | RJ Darshini

13, Mar 2024

ఏపీ లో.. పొత్తుల కత్తులు | AndhraPradesh | TDP | Janasena | BJP