06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
సోమవారం ఉదయం విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఘోర జరిగింది. ఆర్టీసీ బస్సు ప్లాట్ ఫామ్ మీదకు దూసుకురావడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. దీనిపై టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పందిస్తూ.. ఈ ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు.
ఈ ప్రమాదానికి వైసీపీ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉందన్నారు. ప్లాట్ ఫామ్ పైకి బస్సు దూసుకురావడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని చెప్పారు. కాలం చెల్లిన బస్సుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని...
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదని లోకేశ్ విమర్శించారు. ఆర్టీసీ గ్యారేజీల్లో నట్లు, బోల్టుల కొనుగోళ్లకు కూడా ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని దుయ్యబట్టారు.
రిక్రూట్ మెంట్ కూడా లేకపోవడంతో ఆర్టీసి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.