06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
హంద్రీనీవా నీటి విషయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి అనంతపురం జిల్లా మునుపెన్నడూ లేని దుర్భిక్షంలో ఉందన్నారు.
హంద్రీనీవాలో నిలువ చేయాల్సిన నీటిని పుంగనూరుకు తరలిస్తున్నారని.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంత జిల్లాను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
సమీప భవిష్యత్‌లో తాగునీటికి కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు. ‘ఉమ్మడి అనంత జిల్లా ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారు?.. మీకెందుకు ఆ పదవులు. మీరంతా దద్దమ్మలు... చేతకాని వాళ్లు’ అంటూ విరుచుకుపడ్డారు.
తక్షణమే జిల్లాకు తాగునీటిని విడుదల చేయకపోతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.