06-11-2023 Super
తెలంగాణ
తెలంగాణలో ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీల తమ అభ్యుల జాబితాలను విడుదల చేస్తున్నాయి.
ఎన్నికలు సమయంలో ప్రజాశాంతి పార్టీ సందడి చేయడం మామూలే. ఈ క్రమంలో, ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం సోమవారం తొలి జాబితా విడుదల చేసింది. 12 మందితో కూడిన ఈ జాబితాను ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ మీడియాకు విడుదల చేశారు.
మంగళవారం రెండో జాబితా విడుదల చేస్తామని వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ టికెట్ కోసం 344 మంది దరఖాస్తు చేసుకున్నారని కేఏ పాల్ తెలిపారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చే పార్టీ ప్రజాశాంతి పార్టీ అని ఆయన అన్నారు.
ప్రజాశాంతి పార్టీ తొలి జాబితాలో అభ్యర్థులు:
1. కందూరు అనిల్ యాదవ్- ఉప్పల్
2. కట్టా జంగయ్య- కల్వకుర్తి
3. కొప్పుల శ్రీనివాస్ రావు- మధిర
4. మొయ్య రాంబాబు- చెన్నూరు
5. పాండు- గజ్వేల్
6. సిరిపురం బాబు-నర్సాపూర్
7. కర్రోల్ల మోహన్- జుక్కల్ (ఎస్సీ)
8. బంగారు కనకరాజు- రామగుండం
9. బేగరి దశరథ్- జహీరాబాద్
10. కదిర కిరణ్ కుమార్- నకిరేకల్
11. సిల్లివేరు నరేశ్- యాకుత్ పురా
12. అజ్మీరా రమేశ్- వేములవాడ