07-11-2023 Super
తెలంగాణ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ అధికారికంగా ఖరారైంది. కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ అధిష్ఠానం ఆయనను ప్రకటించింది. దీంతో కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌పై రేవంత్ పోటీకి దిగనున్నారు.
16 మంది అభ్యర్థులతో కూడిన మూడో విడత జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. నిజామాబాద్ అర్బన్ సీటును సీనియర్ లీడర్ షబ్బీర్ అలీకి పార్టీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది.
రెండు సీట్లలో అభ్యర్థులను మారుస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డికి సీట్లు కేటాయించింది కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించింది.
తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించినట్టయ్యింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.