07-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆమెను విజయసాయి టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ గారి ఇంటికి పదడుగుల దూరంలో ఉండి కూడా ఆయనకు ఒక్క ముద్ద కూడా పెట్టలేదు కదా చెల్లెమ్మా పురందేశ్వరీ... అంటూ ఎద్దేవా చేశారు.
'ఆ వయస్సులో ఆయన అనారోగ్యంతో బాధపడుతూ కూడా కష్టపడి సాధించుకున్న అధికారాన్ని 8 నెలలు కూడా తిరక్కుండానే మీరు, మీ భర్త.. మీ బావ గారితో చేతులు కలిపి... పాపం! 73 ఏళ్ల వయస్సులో ఆ పెద్దాయనను నిర్దాక్షిణ్యంగా కిందికి లాగిపడేశారే.
ఏం కూతురివమ్మా నీవు? శత్రువుకి కూడా ఇలాంటి కూతుళ్ళు పుట్టాలని ఎవరూ కోరుకోరమ్మా!' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.