07-11-2023 Super
తెలంగాణ
ప్రభుత్వం పై విమర్శల విల్లు ఎక్కుపెట్టిన సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.కోట నీలిమ
ఆమీర్ పేట్ డివిజన్: తెలంగాణ సెంటిమెంట్ తో తలసాని పదేళ్ళు అధికారం ఇస్తే నియోజకవర్గంలో అవినీతిపరమైన పాలన చేస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా మద్దతు కూడగడతామని అవినీతిమయమైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిస్తామని స్పష్టం చేశారు. ఆమీర్ పేట్ డివిజన్ లోని బల్కంపేట్, బి.జె.అర్ కాలనీ, రేణుక నగర్ ప్రాంతాల్లో డాక్టర్ నీలిమ గారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బాల్కంపేట ఎల్లమ్మ ఆలయం సందర్శించి కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటి ప్రచారం చేశారు.
ఈ సంధర్భంగా డాక్టర్ నీలిమ గారికి స్తానిక ప్రజలూ సమస్యలను వివరించారు. వాటిపై నీలిమ గారు మాట్లాడుతూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమని స్పష్టం చేశారు.
ప్రభుత్వం వచ్చిన వెంటనే అర్హులు అందరికి అన్ని పథకాలు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయం లో వచ్చి వెళ్లిపోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదని అన్నారు. కష్టమైన, నష్టమైనా ప్రజలతోనే తన ప్రయాణామని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిజమైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తానని , నియోజకవర్గం లో ప్రతి సమస్యకూ తన దగ్గర పరిష్కారం ఉందని చెప్పారు. ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం లో పరుగులు పెట్టిస్తానని అమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.