07-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కంటి శస్త్రచికిత్స సక్సెస్ అయింది. మంగళవారమాయన హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రిలో కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
క్యాటరాక్ట్ సమస్యతో బాధపడుతున్న ఆయన గతంలో ఓ కంటికి శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. నేడు రెండో కంటికి చేయించుకున్నారు. చంద్రబాబు కంటి ఆపరేషన్ కు సంబంధించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది.
శస్త్రచికిత్స పూర్తయ్యాక చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తుండడం ఆ ఫొటోలో చూడొచ్చు. కాగా, ఆపరేషన్ పూర్తయ్యాక చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. స్కిల్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ నిమిత్తం ఏపీ హై కోర్టు తాత్కాలిక బెయిల్ ఇచ్చింది.