07-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలైన వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తర్వాత మారిన రాజకీయ పరిస్ధితుల్లో విపక్షంపై అధికార వైసీపీ నేతలు, మంత్రులు సెటైర్లు పెరిగాయి.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనను మంత్రి ధర్మాన ప్రసాదరావు పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రస్తుతం అందిస్తున్న పథకాలు, అమలు చేస్తున్న విధానాలు మరే ఇతర పార్టీకి సాధ్యం కాదని చెప్పుకొచ్చారు. ఒకవేళ ఈసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చినా నాలుగు నెలలకు మించి ప్రభుత్వాన్ని నడపలేరంటూ ధర్మాన జోస్యం చెప్పారు. ఎందుకంటే చంద్రబాబు లాంటి వ్యక్తి ఈ పథకాలను నాలుగు మాసాలు కంటే ఎక్కువ కాలం అమలు చేయడం కష్టమన్నారు.