07-11-2023 Super
తెలంగాణ
చిల్లర నాణేలతో నామినేషన్ వేయడానికి ప్రయత్నించారు బహుజన ముక్తి పార్టీ అభ్యర్థి చంద్రకాంత్. జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు మంగళవారం పూర్తి చిల్లరతో నామినేషన్ దాఖలు చేసేందుకు ప్రయత్నించారు.
కానీ రిటర్నింగ్ అధికారులు ఆ చిల్లరను నిరాకరించడంతో నోట్ల రూపంలో రూ.5000 చెల్లించి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మొత్తం రూ.10 నాణేలు తీసుకు వచ్చారు.
నామినేషన్ అనంతరం ఆయన మాట్లాడుతూ... దేశంలో, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశ్యంతోనే చిల్లరను జమ చేసుకుని వచ్చానన్నారు.
మంచి రాజకీయాలను బలపరచాలన్నారు. ప్రజలకు మేలు చేసే వారిని అసెంబ్లీకి పంపించాలన్నారు. ఈ నాణేలను చాలాకాలంగా తాను కూడబెట్టానని, కానీ రిటర్నింగ్ అధికారి తిరస్కరించారన్నారు. తాను తెచ్చిన నాణేలు ఆర్బీఐ ముద్రించిన నాణేలే అన్నారు. వాటిని తీసుకొని ఉంటే బాగుండేదన్నారు.