07-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ వల్ల ఇప్పటికే హైదరాబాద్ లో మన ఆస్తులు పోయాయని మండిపడ్డారు.
123వ జయంతి సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో ఎన్జీ రంగా విగ్రహం వద్ద టీడీపీ నేతలు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే ఏపీని కేసీఆర్ కు అమ్మేస్తారని ఆరోపించారు.
2019 ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి జగన్ గెలిచారని చెప్పారు. జగన్ మోసాన్ని ప్రజలు గమనించారని తెలుసుకుని... ఓటర్ల జాబితాలో అవకతవకలు చేసి గెలవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా 40 రోజులుగా తెలంగాణకు నీరు వెళ్తోందని... అయినా జగన్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.