07-11-2023 Super
తెలంగాణ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం మరో మూడు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించింది సీపీఎం. కోదాడ, మునుగోడు, ఇల్లందు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసింది.
కోదాడ నుంచి మట్టిపల్లి సైదులు, మునుగోడు నుంచి దోనూరు నర్సిరెడ్డి, ఇల్లందు నుంచి దుగ్గి కృష్ణకు టిక్కెట్లు కేటాయించింది. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 14 మంది అభ్యర్థులతో తొలి జాబితాను, ఇద్దరు అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. తమ్మినేని సీతారాం పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు.