08-11-2023 Super
తెలంగాణ
గెలుపు తమదే
సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ
సనత్ నగర్ లో గెలుపు తనదేనని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ అన్నారు. సనత్ నగర్ డివిజన్లోని అశోక కాలనీలోని సవిత ఇమ్రాన్ హమీద్ ఆధ్వర్యంలో పలువురు మహిళలు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోటా నిర్మల గారు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందడం లేదని అనేక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎంతమందికి రెండు పడకల ఇల్లు ఇచ్చారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల గుండాయిజం బెదిరింపులు తారాస్థాయికి చేరిందని అన్నారు.