09-11-2023 Super
తెలంగాణ
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ లో మంత్రి కేటీఆర్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. ప్రచార రథంపై ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వాహనం పైనుంచి పడిపోయారు.
ఈ ఘటనలో వారికి గాయాలయ్యాయి. పాత ఆలూరు రోడ్ వద్ద ఈ ఘటన జరిగింది. మంత్రి కేటీఆర్ సహా ఇతర నాయకులు ప్రచార వాహనంపైన నిలబడి అభివాదం చేస్తున్నారు.
ఆ వాహనం స్పీడ్ గా ముందుకు వెళ్లడంతో కరెంటు తీగ అడ్డుగా ఉండటంతో వారి వాహనానికి ముందు ఉన్న వాహనాన్ని సడన్ గా ఆపివేశారు. దీంతో నాయకులు ఉన్న వాహనం డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేశారు.
వాహనం అదుపు తప్పడంతో పైన నిలబడి ఉన్న మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ప్రమాదంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని ప్రకటన విడుదల చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దన్నారు.
ఈ ఘటనలో ఎంపీ సురేష్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన పూర్తిగా కిందపడిపోయారు. భద్రతా సిబ్బంది పట్టుకోవడంతో కేటీఆర్ కు పెను ప్రమాదం తప్పింది.