10-11-2023 Super
తెలంగాణ
సనత్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ గారు శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. మొదట బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలు తీసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులు నీలిమ గారి విజయం సాధించాలని ఆశీర్వాదం చేశారు. అనంతరం మోండ మార్కెట్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద.. నుంచి నామినేషన్ కోసం భారీ ర్యాలీ నిర్వహించారు. ఇంద్ర గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.
రామ్ గోపాల్పేటలోని దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మొండ మార్కెట్ నుండి ప్రారంభమైన ర్యాలీ రామ్గోపాల్ పేట్ , ప్యాట్ని సెంటర్ మీదుగా జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకుంది. ర్యాలీలో భారీగా మహిళలు యువకులు పాల్గొన్నారు. అనంతరం జిహెచ్ఎంసి కార్యాలయంలో తన నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ... తనపై నమ్మకంతో సీటు కేటాయించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పేరుపేరునా ధన్యవాదములు, కృతజ్ఞతలు ప్రకటించారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అవినీతి రహిత పాలన అందిస్తూ.. ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. గత తొమ్మిది సంవత్సరాల అహంకారపూరిత పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం వచ్చిందని పిలుపునిచ్చారు.