10-11-2023 Super
తెలంగాణ
ఈనెల 3వతేదీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఆ రోజునుంచే నామినేషన్ల స్వీకరణ మొదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఈనెల 30 తేదీన జరగనున్న ఎన్నికలకు అధికార బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి మధ్య పోటీ నెలకొంది. ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల తుది జాబితా నేడు కూడా విడుదల చేయగా, నామినేషన్ల దాఖలుకు ఈరోజు చివరి రోజు కావటంతో నామినేషన్లు పోటెత్తాయి.
గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గం రైతులు ఎన్నికలలో నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి ఎన్నికల బరిలో నిలిచిన సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి, గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
ఈ నెల 13 వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 15వ తేదీలోపు నామినేషన్లు ఉపసంహరించుకోడానికి అవకాశం ఉంటుంది. 15వ తేదీ బరిలో ఉన్న అభ్యర్థుల లిస్ట్ అధికారులు ప్రకటిస్తారు.