10-11-2023 Super
తెలంగాణ
దీపావళి పండగ సందర్భంగా బాణసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు నవంబర్ 12 నుంచి 15వ తేదీ రాత్రి వరకు అమల్లో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా ఉత్తర్వులు జారీ చేశారు.
ఎక్కువ శబ్ధం వచ్చే టపాసులను రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కాల్చాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పరిమితికి మించి శబ్ధం వచ్చే టపాసులు కాల్చొద్దని సూచించారు. ఎవరైనా ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు.