11-11-2023 Super
తెలంగాణ
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో మే 23, 1943లో చంద్రమోహన్ జన్మించారు. ఆయన అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు.
ఏడేళ్ల వయసు నుంచే నాటకాలు వేసేశారు. వయసుపెరిగే కొద్దీ ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. చంద్రమోహన్ ఎన్నో దశాబ్దాలుగా చలన చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు.
1966లో ‘రంగుల రాట్నం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అలాగే, 1987లో ‘చందమామ రావే’ సినిమాలో నటనకు కూడా నంది అవార్డు అందుకున్నారు. ‘అతనొక్కడే’ సినిమాలో సహాయ నటుడిగా నంది అవార్డు దక్కించుకున్నారు.
చంద్రమోహన్ మృతి పట్ల టీడీపీ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పౌరానిక చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు, తన హాస్యానటనతో తెలుగు ప్రేక్షకులను చంద్రమోహన్ ఆకట్టుకున్నారని గుర్తు చేసుకున్నారు. |
చంద్రమోహన్ తో పాటు పలు చిత్రాల్లో నటించానని, ఆయన మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు లోటు అన్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతికలగాలని భగవంతున్ని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని బాలకృష్ణ తెలిపారు.