11-11-2023 Super
తెలంగాణ
సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ
ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్క వ్యక్తికి అందేలా చర్యలు తీసుకుంటామని సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ గారు అన్నారు.
బన్సీలాల్ పేట డివిజన్లోని ఐ డి హెచ్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ గారు మాట్లాడుతూ... బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులకు కనీసం పింఛన్లు కూడా అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
బన్సీలాల్ పేట లోని దళితవాడలు ఇప్పటికి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉంటున్నాయని విమర్శించారు. పక్కనే ఉండే అపార్ట్మెంట్స్ లో సౌకర్యాలు ఉన్న.. బస్తీలలో ఎందుకు వాటిని కల్పించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీతోనే దళిత టీచర్లు బహుజనుల అభివృద్ధి సాధ్యమని, కాంగ్రెస్ పార్టీ తోటే వారికి సామాజిక న్యాయం లభిస్తుందని ప్రకటించారు.
గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రభుత్వం బస్తీలను పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత రోడ్లు ఇప్పటికీ ప్రధాన సమస్యగా, డ్రైనేజీ అనేది నిత్య సమస్యగా మారిందని తెలిపారు. అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ గెలుపుతోని లభిస్తుందని అభయహస్తం అందించారు.
చేతి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బన్సీలాల్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి, నాయకులు రమేష్, నాశ్రీన్ తదితరులు పాల్గొన్నారు.