11-11-2023 Super
తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ధృవీకరించారు.
నేడో, రేపో ఆమె హస్తం గూటికి చేరతారని చెప్పారు. కాగా, కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న విజయశాంతి. తెలంగాణ ఎన్నికల హడావిడి మొదలైనా ఇప్పటి వరకూ విజయశాంతి బయటకు రాలేదు. మోదీ, అమిత్ షా సభలకు డుమ్మా కొట్టిన ఆమె.. ప్రచారానికి కూడా దూరంగానే ఉన్నారు. తాజా చేరికపై అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.