11-11-2023 Super
తెలంగాణ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన యక్కిలి రవీంద్రబాబు శనివారం కన్నుమూశారు. కాగా.. గత కొన్ని రోజుల నుంచి ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించారు.
కానీ, ఫలితం లేకపోవడంతో ఆయన చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో సినీ లోకం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. నిర్మాత యక్కిలి రవీంద్రబాబు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో జన్మించారు. మెకానికల్ ఇంజనీర్ పూర్తి చేసారు.
ఇక చదువు పూర్తి కాగానే ఛార్టర్డ్ ఇంజనీర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనకు సినిమాపై ఉన్న ఆసక్తితో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్న ప్రముఖ నిర్మాత సాతులూరు వేణుగోపాల్, నిన్న నటుడు కళాభవన్ హనీఫ్, ఈ రోజు ప్రముఖ సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి చెందారు. వారం రోజుల్లోనే ప్రముఖులు చనిపోవడంతో అంతా షాక్ గురవుతున్నారు.