12-11-2023 Super
తెలంగాణ
రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి భారాస పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్రవంతి మాట్లాడుతూ.. ఆలోచించే బీఆర్ఎస్ లో చేరా గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. పార్టీలో ముందు నుంచి వచ్చిన నేతలను వదిలేసి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు. నేను పదవుల కోసం బీఆర్ఎస్లో చేరలేదు.
బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని శ్రవంతి అన్నారు. ఇవాళ కాంగ్రెస్కు రాజీనామా చేసిన స్రవంతి ఈరోజు తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.