13-11-2023 Super
తెలంగాణ
హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని కెమికల్ గోడౌన్‌లో మంటలు చెలరేగి నాలుగు అంతస్తుల వరకు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకొని ఏడుగురు కార్మికులు చనిపోయినట్లు ప్రాధమికంగా గుర్తించారు. అపార్ట్‌మెంట్‌లో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 15 మందిని డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది రక్షించారు.
జనావాసాల మధ్య ప్రమాదం జరగడంతో.. దట్టమైన పొగ, ఘాటైన కెమికల్ వాసనలతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చుట్టుపక్కల ఉండే భవనాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో వారందరినీ ఫైర్ సిబ్బంది, పోలీసులు అక్కడి నుంచి దూరంగా తరలిస్తున్నారు. మంటలు అదుపులోకి రాడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక్కడి పరిస్థితిపై దర్యాప్తు చేపట్టారు పోలీసు అధికారులు. కమర్షియల్ కం రెసిడెన్సియల్ బిల్డింగ్‌గా గుర్తించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కార్ గ్యారేజ్ వద్ద ఉన్న డీజిల్ డ్రమ్ములు పేలి భారీగా మంటలకు కారణం అయింది. సర్వీసింగ్‌కి వచ్చిన కార్లలోని డీజిల్‌ను డ్రమ్ముల్లో నిలువ ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని డీసీపీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.