13-11-2023 Super
తెలంగాణ
మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం ప్రభాకర్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రభాకర్ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మరణించారు. విషయం తెలుసుకున్న మంత్రి రాంగోపాల్ పేట లోని వారి నివాసానికి వెళ్లి పార్ధీవ దేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.