14-11-2023 Super
తెలంగాణ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బ్రాహ్మణవాడి ప్రాంతంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ గారు అన్నారు. బ్రాహ్మణవాడిలో వరదలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ స్థానికులకు అండగా నిలిచిందని ప్రకటించారు.
బేగంపేట్ డివిజన్లోని బ్రాహ్మణవాడిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ గారు మాట్లాడుతూ... బ్రాహ్మణవాడి నాలా సమస్య ఎన్ని సంవత్సరాలు అయినా ఎందుకు పరిష్కారం రాలేదని ప్రశ్నించారు.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బస్తీ సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తున్న నాయకులను ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కచ్చితంగా చేరుతాయని ప్రకటించారు.
మైనార్టీ సంక్షేమ అభివృద్ధి, కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది: సనత్ నగర్ నియోజకవర్గం: కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ
మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని సనత్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోటా నీలిమ గారు అన్నారు. సనత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నిలిమ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ కోటా నీలిమ మాట్లాడుతూ... ఇప్పటికీ అంతర్గత రోడ్లు డ్రైనేజీ ఎందుకు అధ్వానంగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ఇస్తుందని తెలిపారు.
ప్రతి గ్యారెంటీ మహిళా అభివృద్ధి మహిళా కేంద్రంగానే ఇస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని స్పష్టం చేశారు.