14-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
బంగాళాఖాతంలో తాజాగా అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవులకు అనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ, వాయువ్య దిశగా కదిలి మరింత బలపడి వాయుగుండం గా మారే అవకాశం.
దీని ప్రభావంతో నవంబర్ 14 మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అన్నారు.
నవంబర్ 15 బుధవారం విషయానికొస్తే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలాచోట్లా ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి వచ్చాకే ఆంధ్రప్రదేశ్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు.