15-11-2023 Super
తెలంగాణ
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. టీపీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పటాన్ చెరులోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వారికి సముచిత స్థానం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సొంత డబ్బులు పెట్టుకుని పార్టీ కోసం పని చేశానని... టికెట్ ఇస్తానంటేనే ఐదేళ్ల క్రితం తాను కాంగ్రెస్ లో చేరానని చెప్పారు. అప్పుడు, ఇప్పుడు తనకు పార్టీలో అన్యాయం చేశారని మండిపడ్డారు. తన అనుచర వర్గంతో చర్చించి ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.