15-11-2023 Super
తెలంగాణ
సమర్ధవంతమైన నాయకత్వం ఉంటే ప్రజలకు మేలు జరుగుతుందని, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని సనత్ నగర్ MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం అమీర్ పేట డివిజన్ హనుమాన్ టెంపుల్, కుమ్మరి బస్తీ, సిక్ వాడ, హరిజన బస్తీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ముందుగా హనుమాన్ దేవాలయం వద్ద ఆలయ పండితులు మంత్రికి వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ప్రచారంలో మంత్రికి అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఇంటింటా మంగళ హారతులు పట్టి, శాలువాలు, పూలమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇండ్లపై నుండి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.
సిక్ వాడలో ప్రచారానికి ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిక్కులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తమ సంపూర్ణ మద్దతు ను ప్రకటిస్తూ ఇటీవల నే ప్రత్యేక సమావేశం నిర్వహించి ఏకగ్రీవ తీర్మానం చేశారు. అన్ని సందర్భాలలో అండగా నిలిచే తలసాని శ్రీనివాస్ యాదవ్ కే తమ సంపూర్ణ మద్దతు అంటూ వాగ్ధానాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు కు నిదర్శనం అన్నారు.
దేశానికే తెలంగాణ దిక్సూచి గా నిలిచిందని తెలిపారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కల్లబొల్లి మాటలు, ఆచరణ సాధ్యం కాని హామీలతో వచ్చే కాంగ్రెస్, BJP లను ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కలిగిన వ్యక్తి KCR మన ముఖ్యమంత్రి గా ఉండటం మన అదృష్టం అన్నారు.
సనత్ నగర్ నియోజకవర్గంలో 40 సంవత్సరాలలో జరగని అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదిన్నర సంవత్సరాలలో జరిగిందని తెలిపారు. 2014 కు ముందు నియోజకవర్గ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పార్క్ ల అభివృద్ధి, త్రాగునీటి సరఫరా ఎలా ఉండేది... ఇప్పుడెలా ఉంది అనేది కండ్ల ముందే కనిపిస్తుందని వివరించారు.
తాను కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చే నాయకుడిని కాదని, నిత్యం ప్రజల మధ్యనే ఉంటానని గుర్తు చేశారు. అభివృద్ధి లో సనత్ నగర్ ను ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగేందుకు BRS పార్టీని బలపర్చాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
మంత్రి వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, డివిజన్ BRS అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు సంతోష్, ప్రవీణ్ రెడ్డి, కర్ణాకర్ రెడ్డి, బాగిందర్ సింగ్, టిల్లు, సురేందర్ సింగ్, ఆనం జీత్ కౌర్, సుమిత్, లక్ష్మణ్, లలితా చౌహాన్, హరిసింగ్, నరేందర్ రెడ్డి, శేఖర్, అనిల్, నరేష్ తదితరులు ఉన్నారు.