15-11-2023 RJ
ఆంధ్రప్రదేశ్
రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లీజుకు తీసుకున్నట్లుగా కాకుండా ఓనర్ కి మారిందన్నారు. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుందన్నారు. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారన్నారు.
ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే... షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదేనన్నారు. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు మాత్రమే అయిందని.. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.