16-11-2023 Super
తెలంగాణ
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారికి లక్ష్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన చిల్కానగర్ డివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం. డివిజన్లోని 500 విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ కుటుంబాలు లక్ష్మారెడ్డికి మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం.
చిల్కానగర్ డివిజన్ లో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ మరియు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో డివిజన్ కు చెందిన దాదాపు 500 కుటుంబాల సభ్యులు గల చిల్కానగర్ డివిజన్ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంగం ఉప్పల్ బిఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గారికి మద్దతును తెలియజేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.
చిల్కానగర్ గుట్ట పైన కొలువై ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎల్లవేళలా అండగా ఉంటారని ప్రభుత్వం ద్వారా మరియు తన ట్రస్టు ద్వారా సేవలు అందజేస్తానని హామీ ఇచ్చారు..
ఈ కార్యక్రమంలో చిలకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ డివిజన్ అధ్యక్షులు పల్లె నర్సింగరావు
సీనియర్ నాయకుల మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.