16-11-2023 Super
తెలంగాణ
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా విజయశాంతి పార్టీ మారడంపై వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మల్లు రవి సైతం కొన్ని రోజులకిందట విజయశాంతి పార్టీ మార్పుపై ప్రకటన చేశారు. ఆమె కాంగ్రెస్ లో చేరతారని చెప్పారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయశాంతి బుధవారం నాడు బీజేపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషణ్ రెడ్డికి పంపించారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో త్వరలో హస్తం పార్టీలో ఆమె చేరనున్నట్లు తెలుస్తోంది.నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన రోజే బీజేపీకి రాములమ్మ విజయశాంతి బిగ్ షాకిచ్చారు.
ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి లాంటి నేతలు బీజేపీని వీడారు. తాజాగా విజయశాంతి బీజేపీకి గుడ్ బై చెప్పారు. వివేక్, రాజగోపాల్ రెడ్డిలు మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. విజయశాంతి గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.