16-11-2023 RJ
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. నిన్న బెయిల్ పిటిషన్ పై వాదన వినిపించిన సిఐడి తరఫున న్యాయవాదులు. ఈ రోజు కూడా వాదన వినిపించునున్న ఇరుపక్షాల న్యాయవాదులు, ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో ప్రారంభం కానున్న విచారణ.
మరోవైపు చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ ఈనెల ౩౦ కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును ఈ నెల 30 వరకు అరెస్ట్ చేయోద్దని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు లో విచారణ వాయిదా పడింది.
ఈనెల 30న విచారణ చేపడతామని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేది ధర్మాసనం తెలిపింది. ఏపీ సీఐడీ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.