16-11-2023 RJ
తెలంగాణ
ప్రజా వ్యతిరేక పాలన త్వరలోనే అంతం కానుందాని కాంగ్రెస్ పార్టీ సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోట నీలిమ గారు అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గం లోని రాంగోపాల్ పేట్ డివిజన్లో పాన్ బజార్ ప్రాంతంలో డాక్టర్ కోటా అనిల్ కుమార్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సనత్ నగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శీలం ప్రభాకర్ గారికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా కోట నీలిమ గారు మాట్లాడుతూ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని సనత్ నగర్ నియోజకవర్గంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళమని 30వ తేదీన జరగనున్న ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో బస్తీల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉన్న అభివృద్ధి ఏం జరిగింఆదో ప్రజలకు చూపించాలని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే ముందుగా బస్తీల అభివృద్దే లక్ష్యంగా చేస్తామని పేర్కొన్నారు.